మార్లిన్ మన్రో మార్గదర్శకపు మెనూWorldCat Identities27069077n790556510000 0003 6863 9110118583549232535027035271cb11916572r(data)901859375003421636e60deeb-a666-42c5-95cb-a5eada6bbbe53535896500621148jn20000701257XX1036375w6rf6f17
వికీకరించవలసిన వ్యాసములుAC with 15 elementsWikipedia articles with VIAF identifiersWikipedia articles with LCCN identifiersWikipedia articles with ISNI identifiersWikipedia articles with GND identifiersWikipedia articles with SELIBR identifiersWikipedia articles with BNF identifiersWikipedia articles with BIBSYS identifiersWikipedia articles with ULAN identifiersWikipedia articles with MusicBrainz identifiersWikipedia articles with NLA identifiersWikipedia articles with SNAC-ID identifiersప్రపంచ ప్రసిద్ధులు1926 జననాలు1962 మరణాలుసినిమా నటీమణులుమహిళా గాయకులుఅమెరికాలో ప్రసిద్దులు
మార్లిన్ మన్రోహాలీవుడ్సినిమావిజయంసంతకంనయాగరాదుస్తులుజూన్ 11926ఆగస్ట్ 51962
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
మార్లిన్ మన్రో
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్
రవి వర్మకే అందని ఒకే ఒక అందినివో అని సినీ కవీంద్రుడు ఓ అమ్మాయి గురించి వర్ణించిన పాట తెలియనివారు వుండక పోవచ్చు. ఈ వర్ణణకు నిజమైన అర్థం ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.
ఆమె నవ్వితే
హాలీవుడ్ నవ్వింది.
ఏడిస్తే
ఏడ్చింది!
కొంటె చూపు చూస్తే
మెలికలు తిరిగి సిగ్గుపడింది!!
మార్లిన్ మన్రో... పేరుకు అర్థం తెలుసా?
‘వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ’
సన్నగా వర్షం కురుస్తోంది.
టప్..టప్..టప్‌మని చినుకులు పడుతున్నాయి.
కిటికీలో నుంచి వర్షసౌందర్యాన్ని గమనిస్తూ వెచ్చటి కాఫీ తాగుతూ అనుకుంది ఆమె
‘నా పేరు ఏమిటి?’
‘నోర్మా మోర్టెన్‌సన్’
కానీ అస్సలేమీ బాలేదు.
‘ఇంకా కొద్ది కాలంలో హాలీవుడ్ నా గురించి మాట్లాడుకోబోతోంది. నా మీద ఏదో ఒక వార్త రాయనిదే సినిమా పత్రికలు బతకలేని స్థితికి వస్తాయి. ప్రపంచమంతా ఉచ్చరించే నా పేరు సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది?’
వర్షం ఆగిపోయింది. నిశ్శబ్దం ఆ గదిలోకి వచ్చి చేరింది. మెరుపులా ఒక ఆలోచన మెరిసింది నా పేరు నోర్మా... గార్మా కాదు... నా పేరు మార్లిన్ మన్రో!
‘ప్రముఖ నటి మార్లిన్ మన్రో మీడియాతో మాట్లాడుతూ..’’ తనలో తాను చిలిపిగా అనుకుంది.
‘నా పేరు మార్లిన్ మన్రో’... ఎన్నిసార్లు అనుకుందో లెక్కేలేదు.
spot
అదేమిటో.... సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. ‘‘ఏమిటి నాలో లోపం?’’ తనను తాను ప్రశ్నించుకుంది. పరిచయస్తులను ప్రశ్నించింది. స్నేహితులను ప్రశ్నించింది. అందరూ ఒక్కటే అన్నారు ‘దేనికైనా టైం రావాలి’
ఆ టైమ్ సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత వచ్చింది.
‘ది అస్పాల్ట్ జంగిల్’ సినిమాలో మన్రోకు అవకాశం వచ్చింది. హీరోయిన్‌గా కాదు... చిన్న పాత్ర!
‘‘రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ చిన్నాచితకా పాత్రలలో నటించడమేమిటి?’’ అనుకుంది. బయటికి కూడా అంది. ‘‘చాల్లేవే నీ బడాయి... ముందైతే ఏదో ఒక పాత్రలో నటించు’’ సలహా ఇచ్చింది స్నేహితురాలు. సరే అన్నది మన్రో. అదే సంవత్సరం ‘ఆల్ అబౌట్ ఈవ్’ అనే సినిమాలో కూడా నటించింది. ‘బాగా నటించావు’ అని అందరూ అంటున్నారుగానీ బ్రేక్ రాలేదు.
మూడు సంవత్సరాల తరువాత ‘నయాగరా’ సినిమా రూపంలో ఆ బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా మన్రో నటించింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేస్తుంది. ‘నయాగరా’ సూపర్ డూపర్ హిట్ కావడంతో మన్రో ‘సెక్స్ సింబల్’ అయిపోయింది. ఏ నోట విన్నా, ఏ మాట విన్నా ఆమె పేరే. హాలీవుడ్ ‘మన్రో జ్వరంతో’ మంచం పట్టింది.
అప్పుడు విడుదలైన ఆమె హాటు సినిమాను చూసి లేచి హుషారుగా పరుగెత్తింది. ఆమె నటించిన ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’ సినిమా కూడా దుమ్ము లేపింది. భిన్నమైన గొంతు, భిన్నమైన హావభావాలు ఆమెకు ప్రత్యేక నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. విజయం మీద విజయం... విజయమే విజయం. ఇంటర్నేషనల్ స్టార్గా మన్రోకు గుర్తింపు వచ్చింది.
ఇక ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు.
spot
కేవలం 4 సినిమాలతో హాలివూడ్లో హాట్ స్టార్ అయిపోయిన మార్లిన్ మన్రో అప్పుడే తన బాల్యంలోకి తొంగి చూసుకుంది...
మార్లిన్ మన్రో లాస్ ఏంజిల్స్ కౌంటీ హాస్పిటల్లో 1926 జూన్ 1న జన్మించింది. అందరిలా మన్రో బాల్యం అంత ప్రత్యేకమేమీ కాదు... అందాలు, ఆనందాలకు అసలు తన జీవితంలో చోటే లేదు. ఆమెది కన్నీళ్లమయమైన బాల్యం. ముద్దు ముచ్చట తెలియని దీనమైన బాల్యం. తండ్రి ఎవరో కూడా తెలియని విచారకర బాల్యం. తల్లి ఎప్పుడూ రకరకాల మానసిక వ్యాధులతో బాధపడుతూ పిచ్చిదానిలా ప్రవర్తించేది. మన్రో తన బాల్యంలోని ఎక్కువ భాగాన్ని అనాథాశ్రమాలలోనే గడిపింది. పదకొండు సంవత్సరాల వయసులో ఉండగా ‘చిట్టి తల్లీ మీకు మేము అండగా ఉన్నాము’’ అన్నారు దూరపు బంధువులు గ్రేస్, డక్‌గాడార్డ్‌లు.
ఆ చిట్టి కళ్లలో ఒకే సమయంలో వెయ్యి ఇంద్రధనుస్సులు!
గ్రేస్, డక్‌గాడార్డ్ దంపతులు మన్రోను తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ ముచ్చట కొద్దికాలమే కొనసాగింది. డక్‌గాడార్డ్‌కు చాలా దూరప్రాంతానికి బదిలీ కావడంతో తమతో పాటు మన్రోను తీసుకువెళ్లడం కుదరలేదు.
మళ్లీ ఒంటరితనపు చీకటి ఆ అమ్మాయిని పాములా భయపెట్టింది. మళ్లీ ఆమె అనాథాశ్రమంలో చేరక తప్పలేదు. అలా అనాధా శ్రమంలో చేరిన మన్రో కి అనేక సందర్భాలలో లైంగిక వెడింపులకు గురవ్వడం ఎదురైంది. అదే సమయంలో అంటే మన్రో కి 16 ఏళ్ల వయస్సులో జూన్ 19, 1942, న తన ప్రియుడు జిమ్మీ డౌగెట్రీ తో వివాహం జరిగిపోయింది. జిమ్మీ తో వివాహానంతరం మన్రో దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడే మన్రో సినీ జీవితానికి పునాది పడింది.అదే ప్రాంతంలో ఉండే బార్బాంక్ అనే ఫోటోగ్రాఫర్ ద్రుస్టి మన్రో పై పడడంతో ఆమె జీవితంలో సినిమా ఆధ్యాయానికి తెర లేచింది.
1946లో మన్రో తన మొదటి చిత్రం ది అస్పాల్ట్ జంగిల్’ ఒప్పందంపై సంతకం చేసింది.అదే సంవత్సరంలో డౌగెట్రీ, మన్రో జంట వివాహ బంధానికి బీటలు వారాదంతో వారిరువురు విడాకులు తీసుకున్నారు. ఆ సినిమా ఒప్పందంతో అప్పటివరకు నోర్మా మోర్టెన్‌సన్’గా ఉన్నా పేరు కాస్త మార్లిన్ మన్రో గా మార్చుకుంది. అప్పటి నుండి అందరు ఆమెను"మార్లిన్ మన్రో"గా పిలవడం మొదలుపెట్టారు.1950 జాన్ హస్టన్ యొక్క చిత్రం ది అస్పాల్ట్ జంగిల్’ అనే నేర నాటకంలో ఆమె చిన్న పాత్ర పోషించి వీక్షకులను సమ్మోహన పడేలా చేసింది. ఇక అక్కడి నుండి మొదలైన మన్రో ప్రస్థానం సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దిశగా అడుగేసింది.కానీ ఆమె నటనా వృత్తిని నిజంగా 1950 వరకు అంటే ఈ నాటకంలో పాత్ర వేసేవరకు ఊపందుకోలేదనే చెప్పాలి.
అదే సంవత్సరం, ఈవ్ అనే చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఎంతో మంది ప్రేక్షకులను అలాగే విమర్శకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదల తర్వాత ఆమె హాలివూడ్ లో అత్యంత ప్రసిద్ధ నటీమనులలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది...ఇక ఆమె నటనకు దాసోహమయి మన్రోతో నటించాలని అభిలషించిన హాలివూడ్ మేటి నటరాజులెందరో క్యూ కట్టసాగారు...అందానికి తోడు ఆహార్యం...ఆ ఆహార్యానికి సరిపడు అభినయంతో మన్రో ఇక హాలివూడ్లో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది...నిజంగా అందం అంటే ఆమెదే నటన అంటే నిజమైన నిర్వచనం మన్రో నే అని కుండబడ్దాలు కొట్టే చర్చలు ప్రపంచమంతా జరిగేవి...కేవలం నటిగానే కాకుండా ఒక మంచి గాయనిగా మన్రో కనబరిచిన ప్రతిభ న భూతో న భవిష్యాతి.
1953లో ఆమె నటించిన నయాగరా చిత్రం హాలివూడ్ చరిత్రలోనే ఒక సెంసేషన్ గా నిలిచిపోయింది...ప్రియుడితో కలిసి తన భర్తనే హాత్య చేయాలనుకునే స్త్రీ ఉదంతంతో తెరకెక్కించబడిన ఈ చిత్రం హాలివూడ్ లో అడల్ట్ చిత్రాలకు పునాదిగా నిలిచింది...ఈ చిత్రంతోనే మన్రో గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకొని అంతర్జాతీయ స్థాయిలో యువత కలల రారాణిగా వెలిగిపోయింది.
1959లో మన్రో జాక్ లెమోన్ మరియు టోనీ కర్టిస్ తోకలిసి నటించిన సం లైక్ హాట్ అనే హాస్యాభరిత చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది...ఈ చిత్రంలో ఒక మల్టీ మిలియన్ ని పెళ్ళి చేసుకోవాలనే ప్రయత్నంలో ఒక గాయని ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చిందనే కథాంశంతో రూపొందించబడిన సుగర్ కెన్ అనే పాత్రలో ఆమె అత్యద్భుత నటనకుగాను 1959లో బెస్ట్ ఆక్ట్రేస్స్ ఇన్ కామెడీ అవార్డ్ తో పాటు 1959సంవత్సరానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.
Spot
జీవితంలో ఎలా ఉండాలో మన్రోని చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదో కూడా ఆమెనే చూసె నేర్చుకోవాలి.మన్రోకి తన అందాన్ని ఎక్కడ ఎలా ఎంత వాడుకోవాలో బాగా తెలుసు.శరీరం ఉన్నది చూపించడానికే దాన్ని ప్యాకేజీలో పెట్టి భద్రపరుచుకోవడానికి కాదు అని ధైర్యంగా తలటిక్కగా చెప్పగలిగిన సొగసరి మన్రో....నేను నిబందనలను పాటించి ఉంటే ఎక్కడికి చేరుకోక పోయడాన్ని అని ఒప్పుకోగలిగిన గడసరి మన్రో.
ఆల్ అబౌట్ ఈవ్, సమ్ లైక్ ఇట్ హాట్, హౌ to marry ఏ మిలీనియర్, బాస్ స్టాప్ ఇలా అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను విస్మయం చెందేల చేసిన మన్రో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి హాలివూడ్ ని మహారాణిలా ఏలీంది.
విజయాలకు, ఘన విజయాలకు అలవాటు పడిన మన్రోకు అపజయాలు ఎదురవుతున్నాయి. ‘వృత్తిలో ఇలాంటివి సహజమే’ అనుకోకపోవడం వల్ల ఆ అపజయ భారంతో మన్రో మనసు క్రుంగిపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లెట్స్ మేక్ లవ్’, ‘ది మిస్‌ఫిట్స్’ సినిమాలు కూడా బాక్సాఫీసు దగ్గర బిక్కమొఖం వేశాయి.
వృత్తిలో ఎదురుదెబ్బలు తగిలితే వ్యక్తిగత జీవితంలోని మాధుర్యపు నీడలో సేద తీరవచ్చు. వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలు ఎదురైతే వృత్తిజీవితంలోని కీర్తి కాంతిలో వెలిగిపోయి సుఖంగా నవ్వుకోవచ్చు.
కానీ ఒక వైపు వృత్తిజీవితం, మరోవైపు వ్యక్తిగత జీవితం రెండూ సంక్షోభంలో పడ్డాయి. సుదీర్ఘకాలపు ఒంటరితనాన్ని అనుభవించిన మన్రో పెళ్ళి రూపంలో తోడు వెదుక్కోవాలనుకుంది. కాని అది భ్రమ అని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకటి రెండు వివాహాలు విఫలమైన తరువాత బేస్‌బాల్ క్రీడాకారుడు జోయి డిమాగ్గియోను పెళ్ళి చేసుకొంది. నవ మాసాలకే ఆ పెళ్ళి పెటాకులైంది. కొంతకాలానికి ఆర్థర్ మిల్లర్ అనే నాటక రచయితను పెళ్లాడింది. కానీ ఎక్కడా శాంతి లేదు. ఎవరి దగ్గరా శాంతి లేదు. అదిగో మత్తుపదార్థాలు మురిపెంగా పిలుస్తున్నాయి. శాంతి ఇస్తానని నమ్మిస్తున్నాయి. ఆమె అటు వైపు వడివడిగా అడుగులు వేసింది.
అదే సమయంలో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్.కెనడీతో మార్లిన్ మన్రోకు ఎఫైర్ ఉన్నట్లు పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. కెనడీ పుట్టినరోజు సందర్భంగా మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మన్రో పాట పాడుతున్నప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో తప్ప ఆ ఎఫైర్‌ను బలపరిచే ఆధారాలేవీ లేవు. సంచలనం సృష్టించిన ఈ ఫొటో దశాబ్దాల తరబడి అజ్ఞాతంలో ఉంది. మన్రో, కెనడీ కలిసి ఉన్న ఫొటోలు కనిపించకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు ఫిల్మ్ మేకర్ మోర్గాన్ ఇలా చెప్పాడు: ‘‘వాళ్లిద్దరినీ ఫొటో తీయవద్దని సీక్రెట్ సర్వీస్ వాళ్లు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.’’ కెనడీ- మన్రోల మధ్య నిజంగా ఎఫైర్ ఉందో లేదో తెలియదుగానీ... ఊహించిన వాళ్లకు ఉహించినన్ని కథనాలు దొరికాయి!
ఇక చివరగా 1961లో జాన్ హాస్తన్తో కలిసి నటించిన ది మిస్‌ఫిట్స్ అనే చిత్రం తన యదార్త జీవితానికి దగ్గరగా ఉంటూ సాగింది...ఈ చిత్రం తర్వాతే మన్రో ఇక సినెమాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పవలసి వచ్చింది ..మన్రో నటించిన పూర్తిస్థాయి చివరి చిత్రం కూడా ఇదే.
1962వ సంవత్సరం. ‘సమ్‌థింగ్ గాట్ టు గివ్’ సినిమా నుంచి మన్రోను తొలగించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అవి పుకార్లు కాదని, నిజాలే అని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తరచుగా షూటింగులు ఎగ్గొట్టడం వల్లే ఆమెను సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిందని నిర్మాతలు వివరణ ఇచ్చారు. ‘‘అనారోగ్యం కారణంగా షూటింగులకు హాజరు కాలేదు’’ అని చెప్పింది మన్రో.
ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు.
‘‘మన్రోకు అనారోగ్యమా?’’
నటుడు పీటర్ లాఫోర్డ్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో మన్రోకు ఫోన్ చేసి భోజనానికి తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వానించాడు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. పీటర్ తన సహజశైలిలో సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడుగానీ ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడే మన్రో పొడిపొడిగా మాట్లాడుతోంది. సంభాషణకు అర్ధంతరంగా ఫుల్‌స్టాప్ పెట్టి ‘గుడ్‌నైట్’ చెప్పి ఫోన్ పెట్టేసింది. కొంత సమయం తరువాత పీటర్ మళ్లీ ఫోన్ చేశాడు. బిజీసిగ్నల్! మన్రో రిసీవ్ చేసుకున్న చివరి ఫోన్ కాల్ పీటర్‌దే.
1962 ఆగస్ట్ 5 ప్రపంచాన్ని కుదిపేసిన వార్త ఒకటి వెలువడింది
‘ప్రఖ్యాత హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో చనిపోయారు’
లాస్ ఏంజిల్స్‌లోని మన్రో ఇంట్లోని బెడ్ దగ్గర స్లీపింగ్ పిల్స్ కనిపించాయి. కానీ
మన్రో మరణంపై ఎవరికి ఏకాభిప్రాయం లేదు.
కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు ‘డ్రగ్’ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి చివరి కారణాన్నే అధికారికంగా ధ్రువీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీసిన కుట్రసిద్ధాంతాలలో మన్రో మరణం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
ఒక జీవితానికి 36 ఏళ్ల వయసు ఏమంత పెద్దది కాదు. ఆమె మరణ వార్త విని తప్పుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ అడపాదడపా ఆమె ధరించిన దుస్తులు, వాడిన వస్తువుల్లాటివి వేలం వేస్తే, లక్షల డాలర్లలో శ్రీమంతులు సొంతం చేసుకున్నారనే వార్తలు వెలువడుతూనే ఉంటాయి. 1950లో ఆమె నాయికగా నటించిన తొలి చిత్రం 'డోన్ట్ బాదర్ టు నాక' విడుదలవుతున్న సందర్భంగా - ఓ క్యాలెండర్ పై ఆమె నగ్న చిత్రాన్ని విడుదల చే సె సరికి అది హాలీవుడ్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఎందుకు అలాంటి ఫోజ్ ఇచ్చారు అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ఆకలీ బాధకు తాళలేక అని జవాబిచ్చింది మర్లిన్.
ఇంతగా ప్రపంచ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మన్రో తన జీవిత కాలంలో కనీసం ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయింది.కానీ తన జీవితంలో ఒక మరుపురాని గిఫ్ట్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంది.ఆయీన్ స్టీన్ తన ఆటోగ్రాఫ్ తో కూడిన ఫోటోను ఇచ్చి మనోను surpriseకి గురిచేసాడు. తన నటనా జీవితంలో, మార్లిన్ మన్రో సినిమాలు $ 200 మిలియన్లను వసూలు చేసింది. ఇప్పటికీ ఆమె సెక్స్ అప్పీల్ మరియు అందం ప్యాషన్ ప్రపంచంలో ప్రఖ్యాత చిహ్నంగా భావించబడుతుంది.
ఆమె జీవితం, ఆమె వివాహాలు, వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యాలూ అన్నీ సంచలనాత్మకంగా ఉండేవి. నటిగా పరిణత చెంది మరెన్నో విజయాలు సాధించవలసిన తరుణంలో మార్లన్ అర్ధాంతరంగా జీవితరంగం నుంచి నిష్రమించింది. ఆమె పేదరికాన్ని ఎదిరించ గలిగింది కానీ లెక్కకు మించిన సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతలనూ తట్టుకోలేకపోయింది!
చిన్న వయసులోనే కష్టాల దారుల నుంచి, కన్నీటి సుడిగుండాల నుంచి నడిచొచ్చిన మన్రో ఎవరి అండా లేకుండానే, ఎవరి ఆశీస్సులు లేకుండానే తనను తాను నిరూపించుకుంది. ‘అంతర్జాతీయ అందాల తార’గా మన హృదయాల్లో నిలిచి నవ్వుతూ ఉంది!
మార్లిన్ మన్రో (జూన్ 1, 1926—ఆగస్ట్ 5, 1962) అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు, అభినేత్రి, మరియు సినీ నిర్మాత.
వర్గాలు:
- వికీకరించవలసిన వ్యాసములు
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1926 జననాలు
- 1962 మరణాలు
- సినిమా నటీమణులు
- మహిళా గాయకులు
- అమెరికాలో ప్రసిద్దులు
(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.120","walltime":"0.151","ppvisitednodes":"value":79,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":9040,"limit":2097152,"templateargumentsize":"value":0,"limit":2097152,"expansiondepth":"value":4,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":1,"limit":400,"timingprofile":["100.00% 125.647 1 -total"," 60.86% 76.469 1 మూస:Authority_control"," 38.97% 48.968 1 మూస:వికీకరణ"," 35.82% 45.006 1 మూస:Ambox"],"scribunto":"limitreport-timeusage":"value":"0.066","limit":"10.000","limitreport-memusage":"value":1885189,"limit":52428800,"cachereport":"origin":"mw1293","timestamp":"20190328201345","ttl":2592000,"transientcontent":false);mw.config.set("wgBackendResponseTime":115,"wgHostname":"mw1326"););